1. దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసులు, పోస్టల్ శాఖలో పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్టు ఇండియా పోస్ట్ సర్క్యులర్ జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఒడిషా సర్కిల్లోని వేర్వేరు పోస్టల్ యూనిట్స్లోడ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. 9 ఖాళీలను ప్రకటించింది ఇండియా పోస్ట్. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. నియామక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. కానీ ఈ నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్టు ఇండియా పోస్ట్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి నిర్వహించాల్సిన పరీక్షల్ని, ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ఒడిశా పోస్టల్ సర్కిల్ సర్క్యులర్ జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఈ నోటిఫికేషన్ నిలిపివేయడానికి గల కారణాలను ఇండియా పోస్ట్ వివరించలేదు. కానీ... తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామక ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఇక ఇండియా పోస్ట్ ఇటీవల పశ్చిమ బెంగాల్లో 2357 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 19 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)