1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. 2022 జూన్ 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ 2022 నవంబర్ 15 లోగా ముగిస్తామని ఇండియా పోస్ట్ నోటిఫికేషన్లో వెల్లడించింది. గతంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఆలస్యం లేకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది ఇండియా పోస్ట్. అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ లో ఫలితాలు చెక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు తరచూ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండటం అవసరం. ఇదే వెబ్సైట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అప్డేట్ చేస్తుంది ఇండియా పోస్ట్. (ప్రతీకాత్మక చిత్రం)
5. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా చెక్ చేసేందుకు అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Shortlisted Candidates పైన క్లిక్ చేయాలి. రాష్ట్రాల వారీగా జాబితా కనిపిస్తుంది. ప్రస్తుతం అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఫలితాలు విడుదలయ్యాయి. (image: India Post)
6. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలు కూడా ఇలాగే చెక్ చేయాలి. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి సమాచారం కూడా అందుతుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఎస్ఎంఎస్, ఇమెయిల్ రాకపోతే తమ బాధ్యత కాదని ఇండియా పోస్ట్ చెబుతోంది. కాబట్టి అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇండియా పోస్ట్ పదవ తరగతి అర్హతతో 38,926 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులున్నాయి. పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేస్తోంది ఇండియా పోస్ట్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)