ఇటీవల వారంరోజులకు పైగా దంచికొట్టిన వర్షాలకు ఎంతో ఆస్థి నష్టం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఈ నది ముంపు గ్రామాలు అన్నీ మునిగిపోయాయి. ఒక్క కొత్తగూడెంలోనే కాదు.. నది పరివాహక జిల్లాలోని ప్రతీ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
గోదారి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పత్తా లేకుండా పోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో మొదట జూలై 12, 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వరదలు, వాగులు పొంగిపొర్లడంతో మరో మూడు రోజులు ఆ సెలవులను పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారా అనే అంశం తెరపైకి రాగా.. ఆయా జిల్లాల కలెక్టర్లకు సెలవులు ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులను బట్టీ కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)