Scholarship Programme: ఆ విద్యార్థులకు అలర్ట్.. టాప్ 100 మందికి స్పెషల్ స్కాలర్షిప్స్..
Scholarship Programme: ఆ విద్యార్థులకు అలర్ట్.. టాప్ 100 మందికి స్పెషల్ స్కాలర్షిప్స్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 2022లో టాప్-100 ర్యాంక్ హోల్డర్లకు 'బ్రైట్ మైండ్స్ స్కాలర్షిప్' అందించబోతోంది. ఐఐటీ కాన్పూర్ ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది రెండోసారి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 2022లో టాప్-100 ర్యాంక్ హోల్డర్లకు 'బ్రైట్ మైండ్స్ స్కాలర్షిప్' అందించబోతోంది. ఐఐటీ కాన్పూర్ ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది రెండోసారి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం , ప్రతిభ కనబర్చిన వారిని రివార్డ్ చేయడం అనే లక్ష్యంతో ఈ స్కాలర్షిప్లు మొదటిసారిగా 2021 సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
2022-23 విద్యా సంవత్సరానికి B.Tech/BS ప్రోగ్రామ్లో ప్రవేశం పొందడానికి ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. IIT కాన్పూర్ యొక్క లక్ష్యం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.3 లక్షల వార్షిక స్కాలర్షిప్ను అందజేస్తారు. ఇది UG ప్రోగ్రామ్ సమయంలో వారి ఖర్చులను కవర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
IIT కాన్పూర్లో విద్యార్ధులు హాస్టల్ లో ఉన్న సమయంలో ట్యూషన్, హాస్టల్ , ఇతర ఖర్చులతో సహా అన్ని ఖర్చులను కవర్ చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ స్కాలర్షిప్ను IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి శ్రీ లోక్వీర్ కపూర్ స్పాన్సర్ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
IIT-కాన్పూర్లో గ్రాడ్యుయేట్ విద్యార్థి 4-సంవత్సరాల B.Tech/BS ప్రోగ్రామ్ సమయంలో సుమారు రూ. 12 లక్షల భారాన్ని మోయవలసి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
విద్యార్థికి ట్యూషన్ ఫీజు, బోర్డింగ్ , లాడ్జింగ్, పుస్తకాలు, ఆరోగ్య బీమా, రవాణా మొదలైనవాటిని అందించడం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
వీటిలో వార్షిక ట్యూషన్ ఫీజు రూ. 2 లక్షలు , హాస్టల్, పుస్తకాలు, మెస్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులు దాదాపు రూ. 1 లక్ష వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)