1. ఉన్నత చదువులు చదుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్న్‌ల్ అఫైర్స్, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి భారతీయ విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లలో అటల్ బిహారీ వాజ్‌పేయీ జనరల్ స్కాలర్షిప్ స్కీమ్‌ని (Atal Bihari Vajpayee General Scholarship) ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అటల్ బిహారీ వాజ్‌పేయీ జనరల్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 30లోపు సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ICCR A2R పోర్టల్ ఇప్పుడు అభ్యర్థుల కోసం ఓపెన్ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు తెలియజేయడానికి మే 31వ తేదీ వరకు యూనివర్సిటీలకు సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇండియన్ మిషన్ అబ్రాడ్ ద్వారా స్కాలర్షిప్లను కేటాయించడానికి, ఆఫర్ లెటర్లను రూపొందించడానికి జూన్ 30ని గడువుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను జులై 15లోపు అంగీకరించవచ్చు. మొదటి రౌండ్ తర్వాత సీట్లు అందుబాటులో ఉంటే, ఇండియ్ మిషన్స్ ఇతర విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడానికి చివరి తేదీ జులై 22. అదే విధంగా సెకండ్ రౌండ్ అభ్యర్థులు జులై 30లోపు తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. A2A ప్రక్రియ ప్రకారం.. దరఖాస్తులు నేరుగా సంబంధిత విద్యార్థులు నేరుగా యూనివర్సిటీలకు పంపుతారు. మధ్యలో ఎలాంటి ప్రాసెస్ ఉండదు. ఇది ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నేరుగా చూడగలవు. ఇండియన్ యూనివర్సిటీలలో ఇంగ్లీషులో బోధిస్తున్నారు. కాబట్టి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీషు పరిజ్ఞానం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే విధంగా పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారులు 5 విశ్వవిద్యాలయాలు/ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తమకు నచ్చిన విధంగా ప్రయారిటీ ఇవ్వవచ్చు. విద్యార్థులు సూచించిన ప్రయారిటీ మేరకే అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రాధాన్యం ఇచ్చిన యూనివర్సిటీలలో లిమిట్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే అడ్మిషన్ దొరకదు. (ప్రతీకాత్మక చిత్రం)