1. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దరఖాస్తల్ని స్వీకరిస్తోంది. మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తుకు నవంబర్ 26 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐబీపీఎస్ వివిధ విభాగాల్లో 1163 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఐటీ ఆఫీసర్ - 76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ - 670, రాజ్‌భాష అధికారి - 27, లా ఆఫీసర్ - 60, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ - 20, మార్కెటింగ్ ఆఫీసర్ - 310 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీలను చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26 వరకు కొనసాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు అప్లికేషన్ ఫీజు 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26 వరకు చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100, ఇతర అభ్యర్థులకు రూ.600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2019 డిసెంబర్ 28, 29 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలు 2020 జనవరిలో విడుదలౌతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2020 జనవరి 25న జరుగుతుంది. 2020 ఫిబ్రవరిలో మెయిన్స్ ఫలితాలు విడుదలౌతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్‌ను 2020 ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 2020 ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఎంపికైనవారికి అలాహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)