Jobs In IBM: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త.. ఐబీఎంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
Jobs In IBM: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త.. ఐబీఎంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
Jobs In IBM: సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఐబీఎమ్ శుభవార్త చెప్పింది. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఐబీఎమ్ శుభవార్త చెప్పింది. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నాలుగు సంవత్సరాల వరకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
3/ 7
అర్హతల విషయానికి వస్తే.. జావా లేదా పైథాన్ లేదా సీ లేదా సీ++ లేదా రియాక్ట్(REACT) ప్రోగ్రామింగ్ నైపుణ్యం ఉండాలి. ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు మరియు డేటాబేస్లపై అవగాహన ఉండాలి.
4/ 7
గుడ్ కమ్యూనికేషన్ మరియు టీమింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఎస్‌క్యూఎల్(SQL) క్వరీస్ని క్రియేట్/అర్థం చేసుకునే ప్రాథమిక సామర్థ్యంతో పాటు స్క్రిప్టింగ్ టెక్నాలజీ పరిజ్ఞానం కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
గోలాంగ్(Golang), పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్(PostgreSQL), రెడిస్(Redis) నైపుణ్యం ఉండాలి. డాకర్ మరియు కూబర్నెట్స్ గురించి జ్ఞానం కలిగి ఉండటం మంచిది. లినక్స్(Linux) లేదా యూనిక్స్(Unix) కమాన్డ్స్, ఫైల్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలపై అవగాహన ఉండాలి.
6/ 7
ఏదైనా CICD సాధనాల గురించిన అవగాహన ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
జాబ్ లొకేషన్ వచ్చేసి కేరళ,కొచ్చిలో ఉంది. అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తులకు, పూర్తి వివరాలకు https://www.ibm.com/in-en/employment/ వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)