కేంద్ర హోం శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషన్ పోలీస్ అకాడమీ(SVPNPA) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటన్ నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.98 వేల వేతనం చెల్లించనున్నారు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.75,658 వేతనం చెల్లించనున్నారు.
ఎక్స్-రే టెక్నీషియన్ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఇంటర్, రేడియాలజీలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వేతనం రూ.45,186. ఫిజియోథెరపిస్ట్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.60,828 వేతనం చెల్లించనున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసై, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.45,186 వేతనం ఉంటుంది.
-స్పోర్ట్స్ కోచ్ విభాగంలో 1 ఖాళీ ఉంది. అభ్యర్థులు SAIలో కోచింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో సంభాషణ నైపుణ్యం ఉండాలి. వేతనం రూ.42 వేలు.
స్టాఫ్ నర్స్ విభాగంలో 1 ఖాళీ ఉంది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.75,838 చెల్లించనున్నారు. జూనియర్ ప్రొజెక్షనిస్ట్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.33 వేలు. కెమెరామెన్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ/సినిమాటోగ్రఫిలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.51,032 వేతనం ఉంటుంది.