* ఎస్ఎస్సీ సీపీఓ రిక్రూట్మెంట్ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్-ఇన్స్పెక్టర్ల నియామకం కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపడుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 30గా నిర్ణయించారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 735 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* MPPSC గైనకాలజీ స్పెషలిస్ట్స్ : మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 153 గైనకాలజీ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు సెప్టెంబర్ 7లోపు mponline.gov.in లేదా mppsc.mp.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు రూ. 15600 నుంచి రూ. 39100 వరకు జీతం లభిస్తుంది.
* బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 323 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ rectt.bsf.gov.in ద్వారా సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
* పీఎన్బీ మేనేజర్ రిక్రూట్మెంట్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 103 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు pnbindia.inద్వారా ఆగస్టు 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు పే స్కేల్ రూ. 36,000 కాగా, సెక్యూరిటీ మేనేజర్ పోస్టుకు పే స్కేల్ రూ. 48,170. జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1003 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైతే రూ. 59 చెల్లించాల్సి ఉంటుంది.
* పీఎన్బీ పీవో రిక్రూట్మెంట్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 6432 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా ఆగస్టు 22 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.