నిరుద్యోగులకు అలర్ట్. ప్రస్తుతం వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు (Government Organizations) వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల (Government Jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన గడువు త్వరలోనే ముగియనుంది. ఆ ఉద్యోగాల డెడ్‌లైన్ (Job application deadline), రిక్రూటింగ్ డిపార్ట్మెంట్ పేర్కొన్న నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* AAI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 272 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నియామక ప్రక్రియను మొదలెట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 21లోపు aai.aero వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటారు.
* రాజస్థాన్ హోంగార్డు డిపార్ట్మెంట్ : ప్రస్తుతం రాజస్థాన్ హోంగార్డ్ డిపార్ట్మెంట్ 3,842 హోంగార్డు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 12 నుంచి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేవారు రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్‌కి home.rajasthan.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* AIIMS రాయ్‌పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : AIIMS రాయ్‌పూర్ కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రూప్ A ఫ్యాకల్టీ కిందికి ఈ ఉద్యోగాలు వస్తాయి. దరఖాస్తు చేయడానికి, దరఖాస్తును ఆన్లైన్లో aiimsraipur.edu.in లేదా మెయిల్ ద్వారా AIIMS రాయ్‌పూర్ రిక్రూట్మెంట్ సెల్‌కు జనవరి 27వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగం వస్తే, మీరు ప్రతి నెలా రూ.1,42,506 వరకు అందుకోవచ్చు.
* ఇండియన్ రైల్వేస్ అప్రెంటిస్ : నార్త్ వెస్ట్రన్ రైల్వే కొత్త అప్రెంటిస్‌ల కోసం వెతుకుతోంది. ఈ సంస్థ 2,026 మందిని నియమించుకోవాలని యోచిస్తుంది. దరఖాస్తు చేయడానికి, మీరు RRC జైపూర్ అధికారిక వెబ్‌సైట్‌కి (rrcjaipur.in) వెళ్లి మీ దరఖాస్తును సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 చివరి తేదీ. 10వ తరగతి మార్క్స్, వారు తీసుకున్న ITI కోర్సు ఆధారంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తుంది.
* ఇండియన్ రైల్వేస్‌లో 7,914 పోస్టులు : దక్షిణ మధ్య రైల్వే (SCR), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) తమ బృందంలో కొత్త అప్రెంటిస్‌లను నియమించుకోవడం ప్రారంభించాయి. ఈ మూడు రైల్వేలలో 7,914 ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి, మీరు సంబంధిత రైల్వే జోన్ల అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మీ దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు.
* కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌లో జాబ్స్ : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) 34 గ్రేడ్ III టెక్నికల్ అసిస్టెంట్లను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ కోసం ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 17లోపు csir.res.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్య ఉంటుంది.