నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నిలుపుకునే పనిలో పడ్డాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీలు జీతాలు పెంచాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా ఐటీ రంగానికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. జీతాల పెంపు కారణంగా దేశీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై చేసే వ్యయం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ (ఉద్యోగ వలసలు) రేటు 27.7 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల యావరేజ్ జీతాన్ని 12-13 శాతం పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో హై పొటెన్షియల్ స్టాఫ్ జీతాలు 22-23 శాతం పెరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) 2023 ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగుల జీతాలను 6 నుంచి 8 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మెరిట్ ఆధారిత జీతాల పెంపుదల కోసం తన ప్రపంచ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తమ ఉద్యోగులతో సత్యనాదేళ్ల ఇలా చెప్పుకొచ్చారు. ‘‘మన కస్టమర్లు, భాగస్వాములను శక్తివంతం చేయడానికి మీరు చేస్తున్న అద్భుతమైన పని కారణంగా కంపెనీ ప్రతిభకు ఎక్కువ డిమాండ్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ విషయం అనేక సార్లు రుజువైంది. లీడర్షిప్ టీమ్‌లో మీ ప్రతిభను గుర్తించి, ప్రశంసించాం కూడా. ఇందుకు నేను మీకు పెద్ద కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీలోని ప్రతి ఒక్కరిపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నాం.” అని ఉద్యోగులకు సత్య నాదెళ్ల ఇమెయిల్ చేశారన్న విషయాన్ని ట్రేడ్ పబ్లికేషన్ గీక్‌వైర్ మొదటగా వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
టీమ్‌లీజ్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి బిజినెస్ స్టాండర్డ్‌తో మాట్లాడుతూ.. కంపెనీలు తమ వేతన వ్యయాన్ని పెంచుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఉద్యోగి వాస్తవ జీతం తగ్గుతున్న రేటులో పెరుగుతుందన్నారు. ఇటీవల విడుదలైన జాబ్స్ రిపోర్ట్ ను ఆమె ఉటంకిస్తూ... ఉద్యోగులు సూపర్-స్పెషలైజ్డ్ జాబ్ పాత్రలను ఎంచుకున్నారని, ఈ వర్గాలకు డిమాండ్ కూడా పెరుగుతోందని రీతుపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఏడాది ఈ విభాగంలో వృద్ధి రేటు 11-12 శాతం పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్ లెవల్ పరిహారం ప్యాకేజీని రూ. 3-3.6 లక్షల నుండి రూ.4.25 లక్షలకు పెంచింది. మరో కంపెనీ కాగ్నిజెంట్ ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని వెల్లడించింది. ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్న నేపథ్యంలో వారి వేతనాలను సవరించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)