తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను ఇటీవల తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కీని ఇటీవల అధికారులు విడుదల చేశారు. అయితే.. మొత్తం 8 ప్రశ్నలను తొలగిస్తున్నట్లు కీలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఇప్పుడు 8 ప్రశ్నలను తొలగించడంతో ఆ మార్కులను కలపనున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు అర్హత మార్కులు ఎన్ని అనే అంశంపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తొలగించిన ప్రశ్నలను తీసి వేయగా 52 మార్కులను సాధించిన వారంతా తర్వాతి పరీక్షలకు అర్హులని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)