1. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB రీఫండ్ నోటీస్ జారీ చేసింది. పారామెడికల్ కేటగిరీలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ జారీ చేసిన CEN 02/2019 నోటిఫికేషన్‌కు అప్లై చేసిన అభ్యర్థులకు రీఫండ్ వస్తుంది. 2020 ఫిబ్రవరి 23 నుంచి ఆర్ఆర్బీ పారామెడికల్ కేటగిరీ నోటిఫికేషన్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఛార్జీలను రీఫండ్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పోస్ట్ ఆఫీస్, పేటీఎం ద్వారా పేమెంట్ చేసినవారు 2020 ఫిబ్రవరి 28 లోగా తమ బ్యాంకు అకౌంట్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది ఆర్ఆర్బీ. అభ్యర్థులు తమ బ్యాంకు అకౌంట్ వివరాలు సరిగ్గా అప్డేట్ చేయకపోతే రీఫండ్ పొందకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా అందులో బ్యాంకు ఛార్జీలు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫీజు మినహాయించి రూ.400 రీఫండ్ రూపంలో లభిస్తుంది. ఆర్ఆర్బీ జారీ చేసిన రీఫండ్ నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 రీఫండ్ లభిస్తుంది. పరీక్షకు హాజరైనవారికి మాత్రమే ఈ రీఫండ్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతీయ రైల్వేలో 1937 పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో 1,109 స్టాఫ్ నర్స్, 289 హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, 277 ఫార్మాసిస్ట్ పోస్టులు, 13 ఇతర విభాగాల పోస్టులున్నాయి. ఈ పోస్టుల నియామక ప్రక్రియ ముగిసింది. (ప్రతీకాత్మక చిత్రం)