1. ఆర్మీ ఉద్యోగం మీ కలా? భారత సైన్యంలో సేవలు అందించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది. 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే 2021 జనవరిలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. లేదంటే రిక్రూట్మెంట్ ర్యాలీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్ (AE), సోల్జర్ జనరల్ డ్యూటీ (GD), సోల్జర్ ట్రేడ్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టుల్ని భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారికి 2021 జనవరి 15న స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది. అభ్యర్థులు అదే రోజున సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో ఉన్న థపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హతల వివరాలు చూస్తే సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. సోల్జర్ టెక్ (AE) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి. సోల్జర్ Clk/SKT పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 50 శాతం మార్కులు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)