1. నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1000 పోస్టుల భర్తీకి మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో గన్నవరంలో గ్లోబల్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... 1000 పోస్టుల్ని భర్తీ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇంటర్మీడియట్ నుంచి బీటెక్, ఎంటెక్ లాంటి ఐటీ కోర్సులు పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, న్యూ విస్టాస్ డైరెక్టర్ శ్రీమతి శివశంకర్ ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లోని న్యూ విస్టాస్ ప్రోగ్రామ్‌లో భాగంగా విజయవాడ సమీపంలోని గన్నవరం యూనిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 1000 పోస్టుల్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించే మెగా వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇవ్వనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hcltech.com/careers వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరో నాలుగు ఏళ్లలో విజయవాడ యూనిట్లో ఉద్యోగులు 5,000 సంఖ్యకు చేరుకోనున్నట్టు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. వీరిలో 90 శాతం విజయవాడ, పరిస ప్రాంతాలకు చెందినవారికే అవకాశం లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)