ఎంసెట్ (Eamcet), నీట్ (NEET), జేఈఈ (JEE) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ ఉచిత శిక్షణ పోగ్రాంను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఈ నెల 6న ప్రారంభించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారు. అంతే కాకుండా జిల్లాల్లో 32 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అలాగే, ఈ వీడియోలు యూట్యూబ్ ఛానెల్ ' Deparment of Intermediate e-learning Telangana' లో అప్ లోడ్ చేస్తారు అధికారులు. ఇప్పటికే.. ఈ ఉచిత శిక్షణ కోసం 12 వేల మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా ఇంటర్ సెకండియర్ విద్యార్ధులు కూడా ఫ్రీ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ విద్యా శాఖ అధికారులు కోరారు.
దేశంలోనే అత్యంత పేరొందిన పోటీ పరీక్షల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) ఒకటి. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఎగ్జామ్ (Exam) కు పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే డాక్టర్ కావాలన్న కలతో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు ఏళ్ల పాటు ప్రిపేర్ (NEET Preparation) అవుతూ ఉంటారు. చాలా మంది లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు.
అనేక మంది పేద విద్యార్థులు కోచింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేక ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలతో వారు ప్రిపరేషన్ సాగిస్తారు. అయితే అలాంటి విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. కేవలం ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నీట్ ఎగ్జామ్ కు ఇంట్లో నుంచే ఉచితంగా కోచింగ్ పొందే అవకాశం ఉంది. Affinity Education App మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తుంది.