1. భారతీయ రైల్వేతో పాటు రైల్వేకు చెందిన సంస్థల్లో అప్రెంటీస్ చేసిన వారికి రైల్వే ఉద్యోగాల విషయంలో ఇతర అభ్యర్థుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భారతీయ రైల్వే ప్రకటించింది. అయితే కనీస అర్హత మార్కులు, మెడికల్ స్టాండర్డ్స్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాత అప్రెంటీస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ రైల్వేకు చెందిన అన్ని రైల్వే జోన్లు తరచూ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటాయి. రైల్వేకు చెందిన అన్ని జోన్లతో పాటు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ వీల్ ఫ్యాక్టరీ లాంటి ఇతర సంస్థలు కూడా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటాయి. పలు ట్రేడ్స్‌లో ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసినవారు అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అప్రెంటీస్ పోస్టుల గడువు ఏడాది మాత్రమే ఉంటుంది. అయితే అప్రెంటీస్లుగా పనిచేసినవారికి రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అయితే సరైన రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకుండా రైల్వేలో ఉద్యోగాలు కోరడం ఆమోదయోగ్యం కాదని రైల్వే పేర్కొంది. ఈ డిమాండ్ రాజ్యాంగ నిబంధనలను, ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తుందని వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అప్రెంటీస్ గడువు పూర్తైన తర్వాత వారు రైల్వేలో తాత్కాలిక పద్ధతిలో సేవలు అందిస్తున్నారు. అయితే రైల్వే అవసరాల కోసం వారు విధులు నిర్వహిస్తున్నారు. అవి శాశ్వత ఉద్యోగాలు కావు. అయితే రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలకు పోటీపడే సమయంలో అప్రెంటీస్ అభ్యర్థులు కూడా మిగతా అభ్యర్థుల్లా నియామక పరీక్షలు రాయాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే రైల్వే రిక్రూట్మెంట్లో న్యాయమైన, పారదర్శకత, నిష్పాక్షికత తీసుకురావాలనే ఉద్దేశంతో 2017 నుంచి లెవెల్ 1 ఉద్యోగాలు నియామక ప్రక్రియను సెంట్రలైజ్ చేసింది రైల్వే. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తోంది. అయితే 2014లో సవరించిన అప్రెంటీస్ చట్టం ప్రకారం అప్రెంటీస్లను నియమించుకోవడానికి ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆ సవరణను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే తమ సంస్థలో అప్రెంటీస్లుగా పనిచేసిన వారికి లెవెల్ 1 ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఇవ్వడానికి ఓ నిబంధన రూపొందించింది. అప్రెంటీస్ అభ్యర్థులు కూడా ఇతర అభ్యర్థుల లాగా పరీక్షలు రాయాలి. కనీస అర్హత మార్కులతో క్వాలిఫై కావాలి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా సరిపోవాలి. ఆ తర్వాత మిగతా అభ్యర్థుల కన్నా అప్రెంటీస్ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాల విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)