Police Vacancies 2022: పది పాసైన వారికి గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
Police Vacancies 2022: పది పాసైన వారికి గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 293 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

2/ 7
ఈ పోస్టులకు అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హత , ఆసక్తి గల అభ్యర్థులు https://itbpolice.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అభ్యర్థుల యొక్క వయస్సు నవంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దరఖాస్తుల ప్రక్రియ అనేది నంబంర్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 22, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 అప్లికేషన్ ఫీజును జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు చెల్లించాల్సి ఉంటుంది.
5/ 7
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మెరిట్ ప్రకారం.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అర్హత సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వీటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా టైలర్, గార్డెనర్, కోబ్లర్ కానిస్టేబుల్ పోస్టులు 65 ఉండగా.. సఫాయి కర్మాచారీ, వాషర్ మెన్ , బార్బర్ వంటి కానిస్టేబుల్ పోస్టులు 222 ఉన్నాయి. మిగతా వివరాలకు అధికారికి వెబ్ సైట్ ను https://itbpolice.nic.in/ సందర్శించండి.