2. భారతదేశంలో ఉద్యోగులు తక్కువ కాలం పనిచేసి మరో కంపెనీలోకి మారుతుంటారు. దీని వల్ల గ్రాట్యుటీకి అర్హత సాధించలేకపోతున్నారు. సాధారణంగా వరుసగా ఐదేళ్లు పనిచేస్తేనే గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. ఐదేళ్ల పైన పనిచేసిన ఉద్యోగులకు అప్పటివరకు అందించిన సేవల్ని గుర్తిస్తూ కంపెనీలు, సంస్థలు గ్రాట్యుటీని అందిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల కాలంలో ఉద్యోగ భద్రత తగ్గిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీని వల్ల గ్రాట్యుటీ పేమెంట్స్ కూడా తగ్గిపోయాయి. ఒకవేళ ఉద్యోగులు ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేస్తున్నా ఆ కంపెనీలు గ్రాట్యుటీని తప్పించుకోవడానికి కొంతకాలంపాటు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. లేదా మరో సంస్థ పేరు మీద వారిని నియమించుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కార్మికుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా గ్రాట్యుటీని ఐదేళ్ల కన్నా తక్కువకు తగ్గించాలని, దీన్ని సోషల్ సెక్యూరిటీ కోడ్లో భాగంగా చేర్చాలని సూచించింది. నిరుద్యోగ బీమా, గ్రాట్యుటీ నిబంధనను ఐదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించడం లాంటి అంశాలను ప్రస్తావించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ కమిటీ సోషల్ సెక్యూరిటీ కోడ్ తుది నివేదికను రూపొందించింది. ఇందులో గ్రాట్యుటీతో పాటు ప్రావిడెంట్ ఫండ్, మెటర్నిటీ బెనిఫిట్స్, అసంఘటిత రంగ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ లాంటి తొమ్మిది చట్టాలను మార్చనుంది. రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వీటికి ఆమోద ముద్ర పడే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. గ్రాట్యుటీ లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంది. సాధారణంగా ఒక నెలలో పనిరోజులు 26 ఉంటాయి. బేసిక్ సాలరీ, డీఏ, కమిషన్ కలిపి గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఒక వేళ ఉద్యోగి చనిపోతే నామినీకి గ్రాట్యుటీ చెల్లిస్తారు. 15 రోజులు x చివరి వేతనం x పనిచేసిన సంవత్సరాలు / 26 అనే ఫార్ములాతో గ్రాట్యుటీని లెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)