Gandhi Hospital Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో భారీ వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి
Gandhi Hospital Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో భారీ వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి
పలు ఉద్యోగాల భర్తీకి గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) నుంచి జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోనే పేరొందిన సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ/గాంధీ హాస్పటల్ (Gandhi Hospital) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 135 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
2/ 6
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 135 ఖాళీల్లో 115 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి. మరో 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు ఉన్నాయి.
3/ 6
విద్యార్హతల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
4/ 6
ఏపీ/తెలంగాణ మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఎంసీఐ/ఎన్ఎంసీ గుర్తింపు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.1.25 లక్షల వేతనం చెల్లించనున్నారు. సివిల్ సర్జన్: ఈ విభాగంలోని 20 ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
5/ 6
ఏపీ/తెలంగాణ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు జులై 1 నాటికి 44 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.52 వేల వేతనం చెల్లించనున్నారు. -అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
6/ 6
రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా The Superintendent, Gandhi Hospital, Musheerabad, Secunderabad చిరునామాకు చేరేలా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.