* UPSC రిక్రూట్మెంట్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సైంటిస్ట్- B, ఇతర పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. డిప్యూటీ కమిషనర్ (హార్టికల్చర్), అసిస్టెంట్ డైరెక్టర్ (టాక్సికాలజీ), డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సహా మొత్తం 14 వేర్వేరు విభాగాల్లో మొత్తం 111 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsconline.nic.in లో 2023 ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు.
* SAIL అప్రెంటిస్ : భిలాయ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. SAIL అధికారిక వెబ్సైట్ portal.mhrdnats.gov.in నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి 2023 ఫిబ్రవరి 19ని చివరి తేదీగా ప్రకటించారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీఎస్/ఐటీ, మైనింగ్, మెటలర్జీ ఇతర విభాగాల్లో ఏడాదిపాటు పనిచేయడానికి మొత్తం 120 అప్రెంటిస్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
* ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ : ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సు కోసం 93 ఖాళీలను భర్తీ చేయనుంది. అవివాహితులైన పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, రక్షణ సిబ్బంది కుటుంబాల వితంతువులు మాత్రమే వీటికి అర్హులు. అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in లో ఫిబ్రవరి 9 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
* ఎయిమ్స్ ప్రొఫెసర్ పోస్టులు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రిషికేశ్ సెంటర్.. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేపట్టింది. మొత్తం 94 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్నవారు 94 ఖాళీల కోసం మార్చి 2 వరకు అధికారిక సైట్ aiimsrishikesh.edu.inలో అప్లై చేసుకోవచ్చు.