* TSPSC రిక్రూట్మెంట్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్సైట్ tspsc.gov.in ద్వారా ఫిబ్రవరి 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ మొత్తంగా 1,365 గ్రూప్ -3 పోస్టులను భర్తీ చేయనుంది.
* ఇండియన్ ఆర్మీ : షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సులో 93 పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పెళ్లికాని మేల్, ఫీమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రక్షణ సిబ్బంది, వితంతువులు ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మేల్ అభ్యర్థుల కోసం 61 SSC (టెక్) పోస్టులు, మహిళల కోసం 32 SSCW (టెక్) పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయనుంది.
* స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) : ఎఎస్సీ మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC అండ్ CBN) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. MTSలో 10,880 ఫోస్టులు, హవల్దార్(CBIC and CBN) 529 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 17లోపు ఎస్ఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* CISF రిక్రూట్మెంట్ : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్ డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్) పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు CISF అధికారిక వెబ్సైట్ cisfrectt.in ద్వారా ఫిబ్రవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 451 ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులకు 268 కాగా, కానిస్టేబుల్/డ్రైవర్ కోసం పోస్టులు 183ను భర్తీ చేయనున్నారు.
* OSSSC రిక్రూట్మెంట్ : ఒడిశా సబ్-ఆర్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (OSSSC) నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు OSSSC అధికారిక వెబ్సైట్ osssc.gov.in ద్వారా ఫిబ్రవరి 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 7,483 నర్సింగ్ ఆఫీసర్ ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 29,200 -రూ.92,300 పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : యూనియన్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు UBI అధికారిక వెబ్సైట్ bankofindia.co.in ద్వారా ఫిబ్రవరి 12 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
* స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, భిలాయ్((SAIL-Bhilai) మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ, సివిల్, CS/IT వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక పోర్టల్ portal.mhrdnats.gov.in ద్వారా ఫిబ్రవరి 19 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.