IIT Kharagpur: కరోనా కారణంగా ఈ సంవత్సరం కూడా విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఐఐటీలు ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్... మెషిన్ లెర్నింగ్‌లో ఆన్లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. స్వయం NPTEL ప్లాట్‌ఫామ్ ద్వారా మెషీన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాలను సంస్థ నేర్పించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8 వారాల్లో పూర్తి: జులై 26 నుంచి సెప్టెంబర్ 17 వరకు... మొత్తం 8 వారాల్లో కోర్సు ముగుస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసినవారు ఐఐటీ ఖరగ్‌పూర్, NPTEL నుంచి సర్టిఫికెట్ పొందొచ్చు. కోర్సు ఉచితమే అయినా, అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి. దీంతోపాటు సెప్టెంబర్ 20న జరిపే పరీక్ష రాయాలి. ఈ కోర్సులో మొత్తం 2 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
టెక్నికల్ సమస్యలపై చర్చ: ఈ కోర్సులో పాల్గొనేవారికి కాంప్యుటేషనల్ లెర్నింగ్ థియరీపై ప్రాథమిక అంశాలను బోధిస్తారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ అప్లికేషన్‌కు సంబంధించిన వివిధ సమస్యల గురించి చర్చిస్తారు. దీంతోపాటు పైథాన్ ప్రోగ్రామింగ్ సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు నేర్పిస్తారు. మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాల పరిచయం, లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, ఓవర్ ఫిటింగ్, ప్రాబబిలిటీ, బేయిస్ లెర్నింగ్, లాజిస్టిక్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్, కెర్నల్ ఫంక్షన్, న్యూరల్ నెట్వర్క్, కంప్యుటేషనల్ లెర్నింగ్ థియరీ, క్లస్టరింగ్ వంటి విభాగాలను నేర్పిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?: ఈ కోర్సులను ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే కొందరు విద్యార్థులు, నిపుణులు దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, రోబోటిక్స్.. వంటి విభాగాలకు చెందిన విద్యార్థులు, నిపుణులు లేదా వీటిపై ఆసక్తి ఉన్నవారు ఐఐటీ ఖరగ్‌పూర్ అందించే ఉచిత కోర్సు నేర్చుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈ, ఎంఈ, ఎంఎస్, ఎంఎస్సీ, పీహెచ్డీ విద్యార్థులకు ఎలిక్టివ్ కోర్సుగా కూడా ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎలా నమోదు చేసుకోవాలి?: ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 2 లోపు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. అయితే అంతకు ముందు.. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లేదా గూగుల్ అకౌంట్లను ఉపయోగించి స్వయం ఎన్పీటీఈఎల్ ప్లాట్ఫామ్లో సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే SWAYAM అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. వినియోగదారులు పేరు, పాస్వర్డ్, ఈమెయిల్ వంటి వివరాలను ఇచ్చి, స్వయం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అయిన తరువాత, కోర్సు సర్టిఫికెట్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)