తెలంగాణ ఎంసెట్(Telangana Eamcet) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంసెట్(Eamcet) ఇంజనీరింగ్ విభాగాల పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు జరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో మొత్తం 89, ఏపీలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.72 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా. గతేడాది కంటే ఆ సంఖ్య ఈ సంవత్సరం పెరిగింది. ప్రతి సెషన్లో దాదాపు 29 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎగ్జామ్ సెంటర్ కు ఒక గంట ముందే చేరుకోవాలని.. అధికారులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నిమిషం నిబంధన అనేది ఈ సారి సడలించినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ఆలస్యంగా రావడానికి గల కారణాలను తెలపాల్సి ఉంటుంది. హాట్ టికెట్ తోపాటు.. అప్లికేషన్ ఫామ్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిని కార్డు తీసుకురావాలని సూచించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్క్, శానిటైజర్ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉండగా.. అనూహ్యంగా విపరీతమైన వర్షాలు(Rains), వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 14, 15 తేదీలల్లో జరగాల్సిన అగ్రికల్చర్, మెడిసిన్ లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను వాయిదా వేశారు. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది . (ప్రతీకాత్మక చిత్రం)