నేడు(February 06) తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. 2.90లక్షల కోట్లకు పైగా ఈ బడ్జెట్ ను కేటాయించారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించనున్నట్లు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
2014 జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలో 1,61,572 ఉద్యోగాలను భర్తీకి అనుమతించామని వాటిలో 1,41,735 ఉద్యోగాలకు ఎంపికలు పూర్తైనట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని .. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయినట్లు తెలిపారు. వీటితో దాదాపు 65 వేలకు పైగా ఖాళీలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయని అన్నారు. ఇక మిగిలిన పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుందని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)