Entrance Test: తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..
Entrance Test: తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..
Entrance Test: తెలంగాణలో మోడల్ స్కూల్లో ప్రవేశాలకు, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించే టీస్ ఆర్జేసీ సెట్ మరియు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల దరఖాస్తు గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించే టీస్ ఆర్జేసీ సెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తు గడువు శనివారంతో ముగియగా.. ఈనెల 30వరకు పొడిగించినట్లు కార్యదర్శి రమణ కుమార్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
విద్యార్థులు http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎల్పీసెట్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటెట్) తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈనెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ. 100 ఆలస్యరుసుముతో ఈనెల 30 వరకు గడువు ఉందని ఎస్బీటెట్ కార్యదర్శి శ్రీనాధ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
మోడల్ స్కూల్స్లో 6 నుంచి 10 తరతగతుల్లో మిగిలివున్న సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష గడువును ఈనెల 30వరకు పొడిగించామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. విద్యార్థులు http://telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో (ఇంగ్లిషు మీడియం) ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)