ESIC HYDERABAD INVITES APPLICATIONS FOR 120 POSTS APPLY BEFORE 2020 AUGUST 7 SS
ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 ఉద్యోగాలు... రేపే చివరి తేదీ
ESIC Hyderabad Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్, ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 7 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏఏ పోస్టుకు ఏ తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయో పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. మొత్తం 120 ఖాళీలు ఉండగా అందులో ఫ్యాకల్టీ- 39, సూపర్ స్పెషలిస్ట్- 03, సీనియర్ రెసిడెంట్- 47, జూనియర్ రెసిడెంట్ / ట్యూటర్- 31 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.60,000 నుంచి రూ.1,77,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.esic.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)