1. కంపెనీ మారే సమయంలో కొంతమంది ప్రవర్తన, వారు చేసే తప్పులు వారి కెరీర్‌ను ఇరకాటంలో పెట్టేస్తుంటాయి. ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి, పాత కంపెనీ లేదా పాత కంపెనీ యాజమాన్యం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీరు ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ నుండి ఉద్యోగం మానేసి, కొత్త కంపెనీలో చేరాలనుకుంటే ముందుగా పని చేస్తున్న కంపెనీలో దీనికి సంబంధించిన నోటీస్ ఇవ్వండి. అలాగే, మీకు ఆ సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలను తెలుపుతూ, ఇక మీ సేవలను ముగించాల్సిన సమయం వచ్చిందన్నట్లు అధికారికంగా మెయిల్ పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరి కొందరు పాత కంపెనీలో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, అకస్మాత్తుగా ఉద్యోగం మానేస్తుంటారు. పనిచేస్తున్న సంస్థను వదిలివేయడానికి మీ కారణమేదైనా వృత్తిపరమైన విలువలు పాటించడం మీ నైతికతను చూపుతుంది. నోటీస్ పీరియడ్‌లో మీకు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా పూర్తిచేయడం వల్ల ఆ సంస్థతో మీరు ఎప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉండవచ్చు. ఈ చిన్న ప్రపంచంలో ఎవర్ని ఎప్పుడు ఏ అవసరానికి తిరిగి కలుసుకోవాల్సివస్తుందో చెప్పలేం కదా! (ప్రతీకాత్మక చిత్రం)
6. పాత కంపెనీలో ఎలాంటి నోటీస్ లేకుండా ఉన్నపళంగా ఉద్యోగం మానేస్తే, సాధారణంగా వచ్చే మొదటి ఇబ్బంది పీఎఫ్ ఖాతా. కొత్త కంపెనీలో చేరినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు పాత కంపెనీ అనుమతి ఉంటే కానీ పీఎఫ్ ఖాతా బదిలీ కాదు. అప్పుడు మీరు తిరిగి పాత కంపెనీకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు. లేదంటే కొన్ని కంపెనీలు ఒకటి లేదంటే రెండు నెలల జీతాన్ని కంపెనీకి చెల్లించమని అడిగే అవకాశం ఉంది. ఇది మీకు గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్ ప్రకారమే జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రిలీవింగ్ లెటర్ అంటే మిమ్మల్ని ఉద్యోగం నుండి రిలీవ్ చేస్తున్నట్లు కంపెనీ ఇచ్చే అధికారిక ధ్రువీకరణ పత్రం. దీనిని కొత్త కంపెనీలు సాధారణంగా అడుగుతుంటాయి. కొత్త ఉద్యోగంలో చేరే సమయంలో దీనిని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, పాత కంపెనీలో ఇది తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కంపెనీలో అందించిన సేవలను ధ్రువీకరిస్తూ కంపెనీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఎంతో ముఖ్యం. కొత్త కంపెనీలో చేరే సమయంలో ఇది కూడా అవసరమవుతుంది. మీరు పాత కంపెనీతో సత్సంబంధాలను కలిగి ఉన్నట్లైతే వీటిని మీరు సులభంగా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. కొత్త కంపెనీ మీ జీతాన్ని ధృవీకరించే పే స్లిప్‌లు అడుగుతుంది. అలాగే టీడీఎస్ కు సంబంధించి ఫారమ్ 16ను కూడా తీసుకోవాలి. సాధారణంగా ఫామ్ 16ని మే లేదా జూన్ నెలలోనే కంపెనీలు ఇస్తాయి. ఒకవేళ దీనిని కొత్త కంపెనీలో జాయిన్ అయ్యే సమయంలో ఇవ్వకపోతే పే స్లిప్‌లో టీడీఎస్ తగ్గింపులను చూపించినా సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)