ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్-2023 (JEE Main) సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గత నెల రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్వేదికగా #JEEMain2023inApril అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దేనికి సన్నద్ధం కావాలో అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉంది.’ అని మరో స్టూడెంట్ ట్వీట్ చేశాడు. జేఈఈ మెయిన్ కోసం షెడ్యూల్‌ను నెల క్రితం ఎన్టీఏ ప్రకటించింది. అప్పుడే CBSE బోర్డు ప్రాక్టికల్ పరీక్షలతో క్లాష్ అవుతుందని విద్యార్థులు ఎన్టీఏ దృష్టికి తెచ్చారు. ఐఐటీ, NITల్లో BTech, BE, BArch కోర్సుల్లో ప్రవేశానికి 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ - 2023 మార్కులు ఎంతో కీలకమని, దీంతో JEE మెయిన్ 2023 పరీక్షను ప్రీ-బోర్డ్‌ల సమయంలో ఎందుకు షెడ్యూల్ చేశారని విద్యార్థులు NTAను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎగ్జామ్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.