Punch Me Doll : స్ట్రెస్‌ని అలాగే ఉంచుకోకూడదు. వదిలించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువయ్యేకొద్దీ బీపీ, మూర్ఛ, మతిమరపు ఇలా చాలా రకాల వ్యాధులు రాగలవు. మరి ఈ స్ట్రెస్ రిలీఫ్ పంచ్ మి టాయ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. (All images credit - www.amazon.in)
ఆన్లైన్ ఈ-కామర్స్‌లో ఇప్పుడు పంచ్ మీ (Punch Me) టాయ్ ఓ సెన్సేషన్. స్ట్రెస్ వదిలించుకునేందుకు ప్రజలు దీన్ని కొంటున్నారు. ముఖ్యంగా చదువుకునే, పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లల్లో స్ట్రెస్ తగ్గించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
2/ 12
ఈ ఎలక్ట్రిక్ పంచ్ మీ టాయ్‌ని చాలా కంపెనీలు తయారుచేస్తున్నాయి. వీటి ధర రూ.500 నుంచి రూ.1000 దాకా ఉంటోంది.
3/ 12
ఈ టాయ్‌ని ఎన్నిసార్లు కొట్టినా... దీనికి ఏమీ కాదు. కొట్టేవారికి కూడా చేతులకు ఏమీ కాదు. కొట్టిన ప్రతిసారీ ఇది తిరిగి నిలబడగలదు. అందువల్ల ఎంత కొట్టినా ఇబ్బంది అవ్వదు.
4/ 12
ఈ టాయ్‌ని కొట్టినప్పుడు ఇది అబ్బా, అమ్మో, వామ్మో, అయ్యో, దేవుడా, ఓ, అవ్ అంటూ... రకరకాలుగా అరుస్తుంది. అది పిల్లలకు నవ్వు తెప్పిస్తుంది. ఎంత బాగా కొడితే.. అంత బాగా అరవగలదు. కొచ్చే పంచ్‌ని బట్టీ దీని అరుపు మారుతూ ఉంటుంది.
5/ 12
ఈ ఎలక్ట్రిక్ టాయ్.. చాలా రంగుల్లో లభిస్తుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. పరీక్షల్లో చదువుకునే పిల్లలు.. మధ్యమధ్యలో దీన్ని కొట్టడం ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అంటున్నారు.
6/ 12
2 చిన్న బ్యాటరీలతో పనిచేసే ఈ టాయ్‌లో బ్యాటరీస్ ఉండవు. వాటిని విడిగా కొనుక్కోవాలి. బ్యాటరీలు వేసుకున్న తర్వాత దీన్ని కొడితే... అరుస్తూ పనిచేస్తుంది.
7/ 12
ఈ టాయ్‌ని డెస్క్, సోఫా, నేలపై ఎక్కడైనా నిలబెట్టవచ్చు. పిల్లలకు దీన్ని గిఫ్టుగా ఇవ్వొచ్చు. దీన్ని కొట్టినప్పుడు వచ్చే అరుపు విని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
8/ 12
ఈ టాయ్ ఫేస్ ఫన్నీగా ఉండటం వల్ల పిల్లలను ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రీ స్కూల్ పిల్లలు దీన్ని కొడుతూ... నిజంగానే కొడుతున్న ఫీల్ పొందగలరు.
9/ 12
స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, థెరప్యూటిక్ యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు.. ఓ రెండు నిమిషాలు దీన్ని కంటిన్యూగా కొట్టి.. స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అంటున్నారు.
10/ 12
దీని ద్వారా పిల్లలు తమ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో తల్లిదండ్రులు వారికి నేర్పవచ్చు. తద్వారా పిల్లలు.. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
11/ 12
వీటిని రకరకాల వేడుకలకు గిఫ్టుగా ఇవ్వొచ్చని చెబుతున్నారు. పండుగల సమయంలో.. వీటిని గిఫ్టుగా ఇవ్వడం ద్వారా.. అవతలి వారు చాలా ఆనందపడతారని చెబుతున్నారు.
12/ 12
ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ ఉండటంతో... తమ పిల్లల టెన్షన్, స్ట్రెస్ తగ్గించేందుకు తల్లిదండ్రులు ఈ టాయ్ కొంటున్నారు.