తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో సర్కార్ 8 నుంచే సెలవులు ప్రకటించింది . (ప్రతీకాత్మక చిత్రం)
స్కూళ్లు, హాస్టళ్లు తెరవడం వలన ఒమిక్రాన్ కు ఇవి హాట్ స్పాట్ లుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువ స్కూళ్లల్లో వ్యాప్తి జరిగితే బెడ్లు, మ్యాన్ పవర్ సరిపోదని వైద్యారోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో కనీసం ఈ రెండు వారాల పాటు పిల్లలకు సెలవులు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్యశాఖలోని అధికారులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.