ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. కాగా, ఈ సెలవులు కూడా అయిపోతుండటంతో విద్యాసంస్థల పునర్ ప్రారంభంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి (Schools Re open). రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి (Education Minister) సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra reddy) వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.
అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేయాలని సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానా అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచే విద్యాసంస్థలు తెరవనున్నట్లు మంత్రి ప్రకటించారు.
కాగా స్కూళ్లు తెరవడంతోపాటు ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండటం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.