ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎడ్టెక్ కంపెనీ అప్‌గ్రాడ్ (UpGrad) కీలక ప్రకటన చేసింది. త్వరలోనే భారీగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెర్నర్స్‌పై ఇంపాక్ట్ చూపడానికి 2023 మార్చి నాటికి 1400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది.
అప్‌గ్రాడ్ సహ వ్యవస్థాపకుడు & MD మయాంక్ కుమార్ మాట్లాడుతూ.. మరింతగా విస్తరించడానికి కొత్తగా వర్క్‌ఫోర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపారు. తద్వారా ప్రస్తుతం బలంగా ఉన్న ఆన్ లైన్ డెలివరీ మోడల్స్‌పై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత లెర్నర్స్ సరైన ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకునే సమయంలో వ్యక్తిగతంగా తమను కలిసేలా ప్రోత్సహిస్తున్నామని, లెర్నర్స్ అభిరుచికి తగట్టు ప్రోగ్రామ్స్ డిజైన్ ఉంటుందని వివరించారు.
* ఇటీవల ప్రారంభించిన ప్రోగ్రామ్స్ ఇవే.. : గత 90 రోజుల్లో భారత్‌తో పాటు, యూఎస్‌లో, అలాగే ముంబైలోని ATLAS స్కిల్‌టెక్ యూనివర్సిటీలో అప్‌గ్రాడ్ పలు ప్రోగ్రామ్స్ ప్రారంభించింది. ప్రధానంగా స్టడీ అబ్రాడ్, 10 గ్లోబల్ క్యాంపసెస్, జాబ్ ఎనేబుల్డ్, రెడీ ప్రోగ్రామ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి హై గ్రోత్ ఏరియాలపై రిక్రూట్ అయ్యేవారు దృష్టిసారించనున్నారు.
ఇండియన్ మార్కెట్లో హయస్ట్ గ్రాస్ రెవెన్యూతో 2019 నాటికి ఇండియన్ లార్జెస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీగా అప్ గ్రాడ్ అవతరించింది. 2020 నాటికి అప్‌గ్రాడ్‌లో లెర్నర్స్ సంఖ్య 1 మిలియన్ దాటిపోయింది. దీంతో అప్‌గ్రాడ్ డిగ్రీస్, అప్‌గ్రాడ్ రిక్రూట్, అప్‌గ్రాడ్ స్టడీ అబ్రాడ్ వంటి కొత్త ప్రోగ్రామ్స్‌ను లెర్నర్స్ కోసం ప్రారంభించింది.