TSPSC Update: టీఎస్పీఎస్సీ అలర్ట్.. మరో నోటిఫికేషన్ దరఖాస్తులకు ఎడిట్ అవకాశం..
TSPSC Update: టీఎస్పీఎస్సీ అలర్ట్.. మరో నోటిఫికేషన్ దరఖాస్తులకు ఎడిట్ అవకాశం..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ప్రారంభం కాగా.. మరి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ప్రారంభం కాగా.. మరి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా 22 హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విసయం తెలిసిందే. జనవరి 03 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ తాజాగా వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ వెబ్ నోట్ లో ఫిబ్రవరి 08, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2023 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఎడిట్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ.1,27,310 జీతం చెల్లించనున్నారు. ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ నుంచి నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
దీనిలో గ్రూప్ 2, గ్రూప్ 3, లైబ్రేరియన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు.. అకౌంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://www.tspsc.gov.in/ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)