1. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. కాంట్రాక్ట్ గడువు రెండేళ్లు మాత్రమే ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు కొనసాగుతోంది. 2021 ఆగస్ట్ 25 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్సైట్ http://www.ecil.co.in/ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే కేటగిరీ 1 పోస్టుకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో, కేటగిరీ 2 పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో, కేటగిరీ 3 పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)