1. బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డివిజన్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 డిసెంబర్ 21 చివరి తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అప్లై చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలను ఈసీఐఎల్ త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (Source: Ofiicial Notification)
3. విద్యార్హతల వివరాలు చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫీ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. అభ్యర్థుల వయస్సు 2021 నవంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. అందులో కనీసం ఆరు నెలలు ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది మాత్రమే. సంస్థ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. బీఈ లేదా బీటెక్‌లో వచ్చిన మార్కులు, అనుభవం ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించనున్న ఈసీఐఎల్. వేతనాల వివరాలు చూస్తే మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు నెలకు రూ.31,000. అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. లేదా అభ్యర్థులు నేరుగా https://careers.ecil.co.in/advt3921.php లింక్ ఓపెన్ చేయాలి. Apply for Technical Office on Contract Positions పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)