1. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 878 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 జనవరి 10న ప్రారంభం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మొత్తం ఖాళీలు 878 ఖాళీలు ఉండగా అందులో జూనియర్ ఇంజనీర్ (సివిల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు 575 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. (image: DSSSB Notification)
3. అసిస్టెంట్ లా ఆఫీసర్ లేదా లీగల్ అసిస్టెంట్ పోస్టులు 26 ఉన్నాయి. న్యాయశాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి. లీగల్ ప్రాక్టీషియనర్గా ఒక ఏడాది అనుభవం తప్పనిసరి. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 10 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. (image: DSSSB Notification)
4. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 151 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 116 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. (image: DSSSB Notification)
5. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉంటుంది. టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపికైనవారికి రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు https://dsssb.delhi.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థులు ముందుగా https://dsssb.delhi.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో పైన వెల్లడించిన నోటిఫికేషన్లపైన క్లిక్ చేయాలి. లేదా అభ్యర్థులు నేరుగా https://dsssbonline.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Click for New Registration పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. 2022 మార్చి 1న ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)