డ్రోన్ పైలట్ (Drone Pilot) అవ్వాలనుకుంటున్నారా.. అయితే మీకు ఓ గుడ్ న్యూస్. భవిష్యత్తులో డ్రోన్ సర్వీస్ రంగంలో ఏకంగా 1 లక్ష డ్రోన్ పైలట్ ఉద్యోగాలు వస్తాయని తాజాగా కేంద్ర మంత్రి తెలిపారు. డ్రోన్ ఎకోసిస్టమ్ (Drone Ecosystem)పై భారత ప్రభుత్వం ఆసక్తిని మరోసారి బయట పెట్టారు. మంగళవారం రోజు జరిగిన నీతి ఆయోగ్ (Niti Aayog) కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పెరుగుతున్న డ్రోన్ల ప్రాముఖ్యత.. అవి అందించే ఉద్యోగ వృద్ధి గురించి మాట్లాడారు. రాబోయే కొన్నేళ్లలో భారతదేశానికి ఒక లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరం అవుతారని సింధియా పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నీతి ఆయోగ్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ స్టూడియో ఆన్ డ్రోన్స్ (Experience Studio On Drones) ఈవెంట్ సందర్భంగా, సింధియా డ్రోన్స్ తయారీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం రూ.5,000 కోట్ల పెట్టుబడుల పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ఎకోసిస్టమ్ 10,000 ఉద్యోగాల సృష్టికి దారి తీస్తుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
"భారత ప్రభుత్వం, డ్రోన్ ఇండస్ట్రీ వాటాదారుల చురుకైన భాగస్వామ్యంతో డ్రోన్ ఇండస్ట్రీ వృద్ధి మార్గంలో అడుగులేస్తోంది. డ్రోన్ నిబంధనలను సడలించడం ద్వారా... డ్రోన్ శక్తి (Drone Shakti), కిసాన్ డ్రోన్స్ (Kisan Drones) వంటి కార్యక్రమాల ద్వారా డ్రోన్ల పట్ల అవగాహన అందిస్తూ ఈ వేగవంతమైన డ్రోన్ స్వీకరణ కొనసాగింపును ప్రభుత్వం చేపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)