1. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. చండీగఢ్‌లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీలో (TBRL) ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అప్రెంటీస్ లాంటి పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 61 ఖాళీలు ఉండగా అందులో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 1, మెకానిక్ మెకట్రానిక్స్- 1, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 2, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్- 3, మెకానిక్ (ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ పీఎల్సీ)- 1, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ సివిల్- 1, హౌజ్ కీపర్- 1 పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీటితో పాటు ఫిట్టర్- 7, మెషినిస్ట్- 4, టర్నర్- 3, కార్పెంటర్- 3, ఎలక్ట్రీషియన్- 8, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 8, మెకానిక్ మోటార్ వెహికిల్- 2, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 6, కంప్యూటర్ అండ్ పెరిఫెరల్స్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటనెన్స్ మెకానిక్- 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 3, డిజిటల్ ఫోటోగ్రాఫర్- 3, సెక్రెటేరియల్ అసిస్టెంట్- 3, స్టెనోగ్రాఫర్ (హిందీ)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. పోర్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయకూడదు. అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల లోపు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణా కాలం ఒక ఏడాది ఉంటుంది. స్టైపెండ్ రూ.7,700 నుంచి రూ.8,050 మధ్య లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.org/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేసి Candidate క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో Apprentices పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Apprentice Search లో డీఆర్డీఓ టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్డీఓ తిరస్కరిస్తుంది. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. టెన్త్, ఐటీఐ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. అప్లికేషన్ ఫామ్, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ admintbrI@tbrl.drdo.in మెయిల్ ఐడీకి 2021 డిసెంబర్ 20 లోగా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)