1. ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఆర్డీఓకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబరేటరీ-SSPL కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 12 ఖాళీలున్నాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని నియమించనుంది. కొన్ని పోస్టుల్ని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ కేంద్రంలో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్డీ లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. సెమీకండక్టర్ మెటీరియల్స్, డివైజెస్, ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్లో రీసెర్చ్ అనుభవం ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుకు ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఎంఎస్సీ ఫస్ట్ డివిజన్లో పాస్ కావాలి. నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)