DRDO Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. డీఆర్డీఓ నుంచి మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
DRDO Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. డీఆర్డీఓ నుంచి మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న DRDO తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న DRDO తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవల్ప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO)కు చెందిన Aeronautical Development Establishment(ADE)లో ఈ నియామకాలు చేపట్టారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్(JRF), మరియూ రీసెర్చ్ అసోసియేట్(RA) పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 31 వేల నుంచి రూ.54 వేల వరకు చెల్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం
4/ 8
ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.. Research Associate: ఈ విభాగంలో మొత్తం 1 పోస్టును భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ లేదా మైక్రోవేవ్స్ సబ్జెక్టులో PhD చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
AESA డిజైన్, టెస్టింగ్ లో అనుభవం ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మైక్రోవేవ్స్ తదితర సబ్జెక్టులో ఎంటెక్ చేసిన వారు సైతం అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Junior Research Fellow: ఈ విభాగంలో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఈ/బీటెక్ కోర్సులను ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఈఈఈ సబ్జెక్టుల్లో చేసి ఆయా సబ్జెక్టుల్లో ఎంటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
పీజీ, యూజీల్లో తప్పనిసరిగా ఫస్ట్ క్లాసు మార్కులు పొంది ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఎలా అప్లై చేయాలంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు rac.gov.in వెబ్ సైట్ లో అప్లై చేయాలి. అభ్యర్థులకు మార్చి 4వ వారంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)