4. మొత్తం ఖాళీలు 30 ఖాళీలు ఉండగా అందులో గ్యాడ్యుయేట్ అప్రెంటీస్- 8 (బీఎస్సీ-4, బీఏ లేదా బీకాం-4), డిప్లొమా అప్రెంటీస్- 6 (మెకానికల్-2, ఎలక్ట్రానిక్స్-2, కంప్యూటర్ సైన్స్-1, పెయింట్ టెక్నాలజీ-1), ఐటీఐ అప్రెంటీస్- 12 (పంప్ ఆపరేటర్-3, ఫిట్టర్-3, ఎలక్ట్రీషియన్-2, ల్యాబరేటరీ అసిస్టెంట్-2, వెల్డర్-1, ఆఫీస్ అసిస్టెంట్-కంప్యూటర్ ఆపరేటర్-1), 10+2 అప్రెంటీస్- 4 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 9 చివరి తేదీ. అభ్యర్థులు తప్పనిసరిగా https://www.mhrdnats.gov.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఏ, బీకాం పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, పెయింట్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు పంప్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ల్యాబరేటరీ అసిస్టెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్-కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్‌లో ఐటీఐ, 10+2 అప్రెంటీస్‌కు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)