1. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన కాంబ్యాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నైలోని ఈ సంస్థ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 57 ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
2. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ https://portal.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 57 ఖాళీలు ఉండగా అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 31 ఉన్నాయి. వాటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 8, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 4, మెకానికల్ ఇంజనీరింగ్- 11, లైబ్రరీ సైన్స్- 3, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 2 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)