1. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ (NOS) ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ (Scholarship) అందజేస్తోంది. మొత్తం 125 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వివరాలు చూస్తే మొత్తం 125 స్కాలర్షిప్స్ ఉన్నాయి. కేటగిరీల వారీగా చూస్తే షెడ్యూల్డ్ కులాలు- 115, డీనోటిఫై చేసిన సంచార, పాక్షిక సంచార జాతులు- 06, భూమిలేని వ్యవసాయ కూలీలు, సాంప్రదాయ కళాకారులు- 04 చొప్పున స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు 2022 మార్చి 31 లోగా దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలి. 2022 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000 లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ లాంటి కోర్సులు చదవాలనుకునేవారు ఈ స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేయొచ్చు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా http://www.nosmsje.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మొదటిసారి దరఖాస్తు చేసే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇందుకోసం హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)