అంతే కాకుండా.. కంపెనీ తన కొరియర్ సర్వీస్ సామర్థ్యాన్ని రోజుకు 15 లక్షలకు పెంచుకుంటున్నట్లు పేర్కొంది. వీరిలో 10,000 మందికి పైగా అభ్యర్థులు delhivery గిడ్డంగిలో పూర్తి సమయం ఉద్యోగులుగా ఉంటారని తెలిపింది. ఇక మిగిలిన వారు.. వస్తువులను కస్టమర్లకు సరఫరా చేస్తారని.. ఆటోమేటిక్ కొరియర్ , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తెలిపింది.
Delhivery తన లాస్ట్-మైల్ ఏజెంట్ ప్రోగ్రామ్ కింద మాత్రమే 50,000 చివరి-మైల్ ఏజెంట్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. గేట్వేలు, గిడ్డంగులు అండ్ చివరి-మైల్ డెలివరీలో ఆఫ్-రోల్ ఉద్యోగులుగా ఉంటారని కంపెనీ తెలిపింది. పండుగ సీజన్లో కొరియర్ సర్వీస్ బిజినెస్‌లో ఆశించిన అధిక డిమాండ్‌ను చేరుకోవడమే లక్ష్యంగా రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. (Image Credit : Delhivery.com Website)
బిల్డింగ్ డెలివరీ సామర్థ్యంతో పాటు, తాము FY23 మొదటి త్రైమాసికంలో తమ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ ను పెంచామని.. అదనంగా తాము.. కస్టమర్ల డిమాండ్ కు అనుగుణంగా పాన్-ఇండియా పార్శిల్ సార్టేషన్ సామర్థ్యాన్ని రోజుకు 1.5-మిలియన్ షిప్మెంట్లకు పెంచుతున్నట్లు.. Delhivery చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (Image Credit : Delhivery.com Website)
హర్యానాలోని తవడులో ఆటోమేటిక్ కొరియర్ అండ్ పంపిణీ కేంద్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఈ సంస్థ ఈ ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ కంపెనీ జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.399 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.129.6 కోట్ల నష్టం వచ్చింది.