1. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్, సీనియర్ ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్ పోస్టుున్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. ఢిల్లీలో రీజనల్, సిటీలెవెల్ ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. అందులో కన్సల్టెంట్ (సీనియర్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్) పోస్టులు 2 ఉన్నాయి. రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ఇన్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి. లేదా ఐదేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి. కోర్ ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్ట్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. నెలకు రూ.65,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కన్సల్టెంట్ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్) పోస్టులు 3 ఉన్నాయి. ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాస్ కావాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ పాస్ కావాలి. ఆర్కిటెక్చరల్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఆటోక్యాడ్, అడోబ్ క్రియేటీవ్ సూట్, 3డీ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ల్యాండ్‌స్కేప్ ప్రాజెక్ట్‌లో ఒక ఏడాది అనుభవం ఉండాలి. నెలకు రూ.45,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది ఉంటుంది. అభ్యర్థులకు విద్యార్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)