1. కరోనా వైరస్ మహమ్మారితో ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆన్లైన్ కోర్సులకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. లాక్డౌన్లో ఇళ్లల్లోనే ఉన్నవాళ్లు స్కిల్స్ పెంచుకోవడం కోసం ఆన్లైన్లో కోర్సులు (Online Courses) చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు తమకు దొరికిన సమయంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కోసం ఆన్లైన్ కోర్సులపై ఆధారపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. దీంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలకు, ఆన్లైన్ కోర్సులు అందించేవారికీ డిమాండ్ పెరిగింది. భారతదేశంలో అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన కోర్స్ఎరా నివేదిక ప్రకారం 2021 మొదటి త్రైమాసికంలో 1.4 మిలియన్, రెండో త్రైమాసికంలో 2.8 మిలియన్ ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. అంటే మూడు నెలల్లోనే ఎన్రోల్మెంట్స్ రెండింతలు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. 2021 లో మెషీన్ లెర్నింగ్ కోర్సు నేర్చుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారని కోర్స్ ఎరా వెల్లడించింది. దీంతో పాటు డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్, డేటా క్లీనింగ్ లాంటి కోర్సులకూ డిమాండ్ ఉందని తెలిపింది. మరి 2021 లో భారతీయులు ఎక్కువగా నేర్చుకున్న టాప్ 10 కోర్సులు ఏవో, అవి అందించిన సంస్థలు ఏవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెషీన్ లెర్నింగ్ కోర్స్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి ప్రోగ్రామింగ్ ఫర్ ఎవిరీబడీ (గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్) కోర్స్, గూగుల్ నుంచి ఫౌండేషన్స్: డేటా, డేటా, ఎవిరీవేర్, ఫౌండేషన్స్ ఆఫ్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్ (UX) డిజైన్ కోర్సులు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంగ్లీష్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ కోర్స్, యేల్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్షియల్ మార్కెట్స్ కోర్సులు టాప్‌లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్ డెవలపర్స్ కోర్స్, డీప్ టీచింగ్ సొల్యూషన్స్ నుంచి లెర్నింగ్ హౌ టు లెర్న్: పవర్ఫుల్ మెంటల్ టూల్స్ టు హెల్ప్ యు మాస్టర్ టఫ్ సబ్జెక్ట్స్ కోర్స్, యేల్ యూనివర్సిటీ నుంచి ది సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్, ఇంట్రడక్షన్ ఆఫ్ సైకాలజీ కోర్సులు టాప్ 10 లిస్ట్‌లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. గతేడాది యేల్ యూనివర్సిటీ అందిస్తున్న 'ది సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్' కోర్సు కోర్స్ ఎరాలో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది లాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు, ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకోవడానికి ఆన్లైన్ కోర్సులపై ఆధారపడ్డారు. 80 శాతం మంది భారతీయ ఇంజనీర్లు ప్రస్తుత నాలెడ్జ్ ఎకానమీలో ఉద్యోగాలు చేయడానికి సరిపోరని యాస్పైరింగ్ మైండ్స్ నిర్వహించిన "యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే"లో తేలిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం పరిశ్రమకు కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ కేవలం 2.5 శాతం మందిలోనే ఉన్నాయని తేలింది. వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు చెందిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2020 నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ స్పెషాలిటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్టులకు డిమాండ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)