CRPF Recruitment 2023: సీఆర్పీఎఫ్ నుంచి 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్
CRPF Recruitment 2023: సీఆర్పీఎఫ్ నుంచి 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటక్షన్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటక్షన్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది.
2/ 7
మొత్తం 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
3/ 7
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
4/ 7
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు crpf.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
5/ 7
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో) విభాగంలో 143, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) విభాగంలో మరో 1315, మొత్తం 1458 ఖాళీలు ఉన్నాయి.
6/ 7
విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ లేదా అందుకు సమానమైన పరీక్షను గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.
7/ 7
అభ్యర్థుల వయస్సు జనవరి 25 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://crpf.gov.in/rec/index.htm వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.