ఎంపిక విధానం ఇలా.. ఆన్ లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్టు ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పరీక్ష విధానం ఇలా..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలో.. హిందీ/ ఇంగ్లీష్ భాష(25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్(25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్(25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలుంటాయి. రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.