3. Python programming language: స్టాక్ ఓవర్‌ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో పైథాన్ది రెండో స్థానం. నేర్చుకోవడం కూడా సులువే. డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీల్లో వీరికి మంచి జీతాలు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. Digital project management: వెబ్‌సైట్స్, యాప్స్ రూపొందించడంతో పాటు వాటిని మెయింటైన్ చేయడం డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజర్ పని. కరోనావైరస్ సంక్షోభం కారణంగా చాలా సంస్థలు ఫిజికల్ నుంచి డిజిటల్‌కు మారే అవకాశాలు ఎక్కువ. కాబట్టి డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజర్లకు డిమాండ్ పెరుగుతుంది. సిక్స్ సిగ్మా, ఎగైల్, డెవ్ఆప్స్ లాంటి కోర్సులతో ఐటీ సెక్టార్, ఆన్లైన్ రీటైల్, ఇ-కామర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
11. Digital curriculum developer: కరోనా వైరస్ సంక్షోభంతో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు ఆన్లైన్ కోర్సులపై దృష్టిపెడుతున్నాయి. వారికి ఈ పని సులువుగా చేసేవాళ్లే డిజిటల్ కరిక్యులమ్ డెవలపర్లు. వెబ్ డిజైన్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ తెలిస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
12. Information privacy certified professional: కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ కంపెనీలు తమ డేటా రిస్కులో పడుతుందేమోనని భయపడుతున్నాయి. డేటా ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌కు ముప్పు ఉంటుందని భావిస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు చీఫ్ ప్రైవసీ ఆఫీసర్స్‌ని నియమించుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)